మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-3

అప్పటికే మా కళ్లల్లో మహాత్మా గాంధీ ఒక దేవుడి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆయన్ను స్వయంగా కళ్లారా చూసి, ఆయన మాటలు వినాలన్న కోరికని ఎవరైనా ఎలా ఆపుకోగలరు? అందుకని సుమారు ముప్పై ఐదు మైళ్లు కాలినడకన పోయి సాఖీగోపాల్ చేరుకున్నాను.