ఒక వినష్ట అపరాహ్ణం గురించి

ఇదొకటి కనిపిస్తూంటుంది నాకు, నష్టబాల్యాన్నో, నష్టయవ్వనాన్నో తప్పించుకోలేని వాళ్ళ ఇంద్రియాల దాహం ఎంతకీ శమించేది కాదని. ఏమి చేసీ ఆ కార్చిచ్చుని చల్లార్చలేం. అందుకనే ఇట్లాంటి కవుల కవిత్వంలో ఇంద్రియసంవేదనలు తక్కిన మనుషుల కన్నా రెండింతలు తీవ్రంగా ఉంటాయి.