శిథిలాలూ, సమాధులే కాకుండా డిల్లీలో చూడవలసిన స్థలాల్లో మూజియాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కొన్ని ప్రదర్శన శాలలు చూసేను కాబట్టి, ఈ సారి ఏవైనా కొత్త మూజియాలు చూడాలని ఒక టాక్సీ ఎక్కిన మాకు పురానా ఖిలా మలుపు తిరుగుతుండగానే క్రాఫ్ట్స్ మూజియం కనిపించింది. పక్కనే శిల్పసంగ్రహాలయమని దేవనాగరిలిపిలో అక్షరాలు. నేనెప్పుడూ వినిఉండని ఆ సంగ్రహాలయమెట్లా ఉంటుందోనని లోపల అడుగుపెట్టినవాళ్ళం అక్కడే మూడు గంటల పాటు ఉండిపోయాం.