అంతరంగ ప్రయాణం

రెండవ తరహా కథకులు కథ రాయడానికి పూనుకోవడం ద్వారా తమని వేధిస్తున్న కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటారు. అక్కడ ఆ కథ చెప్పడం వల్ల అన్నిటికన్నా ముందు ఆ కథకుడికే ఒక సాక్షాత్కారం సిద్ధిస్తుంది. ఆ కథ చెప్పడం ద్వారా కథకుడు తనని అణచివేస్తున్నబరువునించి బయటపడతాడు. అక్కడ కళ ప్రపంచానికి విముక్తి నివ్వడం కన్నా ముందు కథకుడికి విముక్తి ప్రసాదిస్తుంది.