సృజనాత్మకత మూలాలు ఏమిటి

'ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలినీడలు కలవు' అనే వాక్యాన్ని కవి ఎట్లా ఊహించగలిగాడు? అట్లాంటి మాటలు ఇంతదాకా మరొక కవి గాని లేదా మరో మనిషిగాని ఎందుకు పలకలేకపోయాడు? ఆ మాటలు మామూలు మాటలు కావు, కవిత్వమని మనకు తెలుసు.కాని అట్లాంటి కవితా వాక్యాలు మరొకరెవ్వరూ చెప్పలేరా? మనం పాఠశాలల్లో పిల్లలకి నేర్పలేమా? లేదా ఇప్పటి పద్ధతి ప్రకారం చెప్పాలంటే, ఒక ఇంటరాక్టివ్ యాప్ రూపొందిస్తే, ప్రతి ఒక్కరూ ఆ యాప్ వాడుకుని అట్లాంటి కవితావాక్యాలు సృష్టించలేరా?