ఆధునిక తెలుగుశైలి

ఈ నెల 17 వ తేదీ బుధవారం విజయనగరంలో డా. ఉపాధ్యాయుల అప్పలనరసింహమూర్తిగారి రచన 'ఆధునిక తెలుగు శైలి ' పుస్తకాన్ని గురజాడకీ,గిడుగుకీ అంకితమివ్వడం కోసం ఏర్పాటు చేసిన సభ. వారి తరఫున మండలి బుద్ధప్రసాద్ గారు స్వీకరించారు. గొల్లపూడి మారుతీరావుగారు అధ్యక్షత వహించిన ఆ సభలో ఆ పుస్తకం మీద నేను మాట్లాడాలని నరసింహమూర్తిగారి కోరిక.