దాదాపు రెండుగంటల పాటు అదంతా చూసేక చాలా విలువైన ఒక సృజనని చూసాననిపించింది. అంతకన్నా కూడా అత్యంత విలువైన ఒక వ్యక్తిత్వం, సంస్కారం పరిచయమయ్యాయి అనిపించింది. చెన్నబసవయ్య రుమాలె (1910-88) దేశభక్తుడు, శాసనసభ్యుడు, పాత్రికేయుడు, పురావస్తుప్రేమికుడు, యోగి, ఆధ్యాత్మిక సాధకుడు అని కూడా తెలిసింది. ..
కందుకూరి రమేష్ బాబు
కందుకూరి రమేష్ బాబుని రచయిత అనీ, పాత్రికేయుడనీ, ఫొటోగ్రాఫరు అనీ చెప్తే అతడిలోని అసాధారణవ్యక్తిత్వానికి, అతడి అద్వితీయ దార్శనికతకీ ఎంత మాత్రం న్యాయం చేసినట్టు కాదు. కాని అతడి గురించి తెలుసుకోడానికి అతడి రచనలూ,అతడు తీసిన ఫొటోగ్రాఫులే ఆధారం కావడం మరో వైచి
మహోన్నత కళా తపస్వి
ఒకసారి సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమానికి వెళ్తూ గాంధీజీ రాజమండ్రిలో భగీరధిగారి చిత్రలేఖనప్రదర్శన ప్రారంభించారని తెలియడమే ఒక సంతోషం. అటువంటిది ఆయన భగీరధి గీసిన ఒక లాండ్‌స్కేప్ చూసి, ఆ చిత్రంలో కనిపిస్తున్న మంచుకి, తనకి చలి పుడుతున్నదని చెప్పారంటే, అంత సత్యసంధుడి నోటివెంట అంత ప్రశంస వెలువడిందంటేనే ఆ చిత్రకారుడి కౌశల్యమెటువంటిదో మనం ఊహించవచ్చు.
