
17
క్రైటీరియన్ థియేటర్
లండన్‌లో క్రైటీరియన్ థియేటర్లో చూసిన ‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్ పియర్’ బ్రిటిష్ సాహిత్య గర్వంపైనా, అభిరుచిపైనా, షేక్స్పియర్ పండితులపైనా శరవర్షం. తమ రూపకం గుండె జబ్బులున్నవాళ్ళకీ, నడుం నొప్పి ఉన్నవాళ్ళకీ, ఇంగ్లీషు సాహిత్యంలో డిగ్రీలున్న వాళ్ళకీ, ‘లోపలి చెవి’ సరిగా పనిచెయ్యనివాళ్ళకీ మంచిదికాదని నిర్వాహకులు ముందే హెచ్చరించారు. సరిగ్గా 97 నిమిషాల వ్యవధిలో ముప్పైఏడు నాటకాల్నీ ఏకబిగిన ‘ప్రదర్శించడంతో’ మనం ఉక్కిరిబిక్కిరవుతాం. ‘ప్రదర్శన’ అంటే నాటకాలన్నింటినీ మొత్తంగానో, లేదా కొన్ని ముఖ్యమైన ఘట్టాల్నో ప్రదర్శిస్తారనుకునేరు! అదేమీ కాదు. పదహారు కామెడీల్ని మూడు నిమిషాల్లో ఒకేఒక్క సన్నివేశంలో పూర్తిచేసేస్తారు. పదహారు కామెడీల అసలు కథ ఒకటేననీ, దాన్ని తిరిగి తిరిగి పేర్లు మార్చి అనేక నాటకాలుగా షేక్స్పియర్ రాశాడనీ అందువల్ల అన్నిటినీ ఒక్క సన్నివేశంలో చూపించెయ్యవచ్చనీ వాళ్ళ ప్రతిపాదన!
‘ట్రోయిలెస్ అండ్ క్రెసిడా’ వంటగదిలో కూరలు తరిగే సన్నివేశంగా, ‘రోమియో అండ్ జూలియెట్’ రాక్టాన్గా, ఏడు చారిత్రక నాటకాలు ఫుట్‌బాల్ మ్యాచ్‌గా మనముందు అవతరిస్తాయి. మొత్తం ప్రదర్శన ఒక ఎత్తు, హామ్లెట్ ప్రదర్శన ఒక ఎత్తు. నాటకం ఇంటర్వెల్ నుండి దాదాపు నలభైనిమిషాలు ఒక్క హామ్లెట్ నాటకం పైననే ప్రదర్శన సాగుతుంది. షేక్స్పియర్ నాటకాలన్నింటిలోనూ హామ్లెట్‌ని మించిన కామెడీ లేదన్నది ప్రధాన థీమ్. ఒకదానికొకటి అతకని సన్నివేశాలు, బాహాటంగా బయటపడని పాత్రల స్వభావాలు, రక్తి కట్టించలేని కథాగమనం, వీటన్నిటివల్లా గత ఐదువందలయేళ్ళుగా సాహిత్య తత్వశాస్త్రాల్ని పట్టి ఒదలని హేమ్లెట్ జాడ్యం – వీటి నేపథ్యంలోంచి చూసినపుడు హేమ్లెట్ అబ్సర్డ్ కామెడీగా కన్పించడంలో ఆశ్చర్యం లేదు. దీనిని ఆ ప్రయోక్తలు ఎంత అబ్సర్డ్‌గా, ఎంత కామిక్‌గా చూపవచ్చునో అంతగానూ చూపించారు. స్లోమోషన్లో, ఫాస్ట్మోషన్లో పక్కనుండి, వెనుకనుండి సన్నివేశాల్ని రిపీట్చేసి, ప్రేక్షకులనుండి కొందర్ని పైకి పిలిచి వారిని ఇన్వాల్వ్ చేసి మొత్తం ప్రదర్శనని ఎంత ‘రసాభాస’గా పొడిగించవచ్చనో అంతగానూ పొడిగించారు.
మొదటినుండి చివరి దాకా నాటకమంతా, బ్రిటిష్ సమాజం తనపై తాను వేసుకున్న జోక్ లాగా వుంది. ఈ జోక్ కి తనే విరగబడి నవ్వుతోంది కూడా. షేక్స్పియర్ ని గందరగోళంగా, అంతుపట్టని మర్మంగా, బ్రహ్మాండమంత పెద్దగా ఇన్నేళ్ళుగా పెంచి పెద్దచేసిన బ్రిటిష్ టేస్ట్ పైన కొత్తతరం విసిరిన విమర్శ అది. చిక్కుముళ్ళుగా, అర్థరహితంగా, అసందర్భంగా పెరిగిపోయిన షేక్స్పియర్ పాండిత్యంపైన పెద్ద ఎద్దేవా అది, ముఖ్యంగా అమెరికన్ పాప్ యువతరం ‘పాతప్రపంచం’ పైన ఎక్కుపెట్టిన బాణం అది.
కానీ విశేషమేమంటే, స్క్రిప్టు రచయితలు రీడ్ మార్టిన్, ఆస్టిన్ టిచ్నర్, డేరియల్ సింగర్ తమ షేక్స్పియర్ పాండిత్యంలో పాతతరం పండితులెవరికీ తీసిపోకపోవడం. నాటకాన్ని సమీక్షించిన ఒక విమర్శకుడు ‘షేక్స్పియర్ ని వాళ్ళెంత నిశితంగా అధ్యయనం చేసారంటే నాటకంలో ఎన్నోసార్లు ఎంతో హాస్యాస్పదంగా పలుకుతున్న షేక్స్పియర్ వాక్యాలు నన్నెంత సూటిగా తాకాయంటే, నేను మరోసారి షేక్స్పియర్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను’ అని రాశాడు. వారు తమ నాటకం కాటలాగ్‌లో తమ సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేస్తో మధ్యలో ఒకచోట విలియం షేక్స్పియర్ గురించి ఇలా పరిచయం చేసారు: ‘విలియం షేక్స్పియర్: మరణించిన రూపకకర్త. ఈ మహాశయుడు ఫస్ట్ ఫోలియోలో ప్రచురించబడ్డ 36 నాటకాల్లో కొన్నిగాని మొత్తంగాని రాసి వుండవచ్చునని అంచనా. అతడు బహుశా ఉత్సాహవంతుడే అయి వుండవచ్చుగాని విందువినోదాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించినట్టుగాని, చైనీస్ చెక్కర్ బాగా ఆడగలిగినట్లు గాని ఎక్కడా దాఖలాల్లేవు. మా షేక్స్పియర్ కంపెనీ అభిప్రాయమేమంటే ఒకవేళ షేక్స్పియర్ గాని నేడు జీవించి వున్నట్లయితే తన నాటకాలకు చేసిన ఈ కొత్త వ్యాఖ్యానాన్ని తప్పకుండా ఆమోదించి వుండటమే కాకుండా నాటకం అయిపోగానే కంపెనీలో చేరిపోయి వుండేవాడు కూడా’.
క్రైటీరియన్ పందొమ్మిదో శతాబ్దపు నాటకశాల. 1870లో ఒక రెస్టారెంట్‌గా నిర్మించబడ్డ భవనం, 1874లో ఒక నాటకశాలగా మార్చబడింది. దాదాపు 1899 వరకూ ఛార్లెస్ వింథామ్ అనే నటుడే నాటకశాలని స్వయంగా నిర్వహించుకునేవాడు, ముఖ్యంగా కామెడీల్ని ప్రదర్శిస్తుండేవాడు. యుద్ధకాలంలో కూడా నాటకశాల ప్రదర్శనలు కొనసాగిస్తూనే వుండేది. రెండవ ప్రపంచయుద్ధకాలంలో అండర్ గ్రౌండ్ ఆడిటోరియం బి.బి.సి. బ్రాడ్కాస్ట్ స్టూడియోగా పనిచేసింది. యుద్ధానంతరం అవంత్గార్డే ప్రదర్శనల్ని ముందుకు తేవడంలో క్రైటీరియన్ మరొకసారి ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ ప్రదర్శనల్లో శామ్యూల్ బెకెట్ ‘వెయిటింగ్ ఫర్ గాడోట్’ (1955) కూడా ఉంది. 1992 తర్వాత మరిన్ని మార్పులు చేపట్టినప్పటికీ క్రైటీరియన్ లండన్‌లోని విక్టోరియన్ యుగపు ఆడిటోరియంగానే నేటికీ ప్రదర్శకుల్ని, ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ వుంది. నాటకశాలలో నన్ను బాగా ఆకర్షించింది, ఆ నిర్మాణంలో మనకు గోచరించే ఆత్మీయ సాన్నిహిత్యం. ప్రదర్శన జరుగుతున్నంతసేపూ రంగస్థలానికీ, ప్రేక్షక శ్రేణికీ మధ్య ఆత్మీయ సామీప్యం నటుణ్ణి ప్రేక్షకుణ్ణి మిత్రుల్ని చేస్తుంది. తమ మధ్యనుంచే తమ మిత్రులు కొద్దిమంది తమకోసం ప్రదర్శనకి పూనుకున్నారేమోననే ఆత్మీయతాభ్రాంతికి ప్రేక్షకుడు లోనవుతాడు. ఈ ఆత్మీయతాభ్రాంతిలోనే నాటకం విజయం ఉంది, సినిమాకన్నా నాటకానికి సాధ్యమయ్యే సమ్మోహరహస్యం ఉంది.
18
మ్యూజియంల నగరం
మాంచెస్టర్ ని మ్యూజియంల నగరం అనవచ్చు. నేషనల్ మ్యూజియం ఆఫ్ లేబర్ హిస్టరీ, మ్యూజియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్, లంకాషైర్ మైనింగ్ మ్యూజియం వంటి చూడదగ్గ ఎన్నో మ్యూజియాలున్నాయి, కాని మేం మాంచెస్టర్ మ్యూజియంతోపాటు మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ మాత్రమే చూడగల్గాం. నగరంలోని చారిత్రక స్థలం అయిన కేసిల్ఫీల్డ్ ప్రాంతంలో డీన్స్ గేట్ వద్ద అయిదు బ్లాకుల్లో నిర్వహిస్తున్న మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ అవార్డ్ విన్నింగ్ మ్యూజియం. మాంచెస్టర్ ప్రపంచంలోనే మొదటి పారిశ్రామికవాడ అయినందువల్ల ఈ మ్యూజియంకి విశేష ప్రాధాన్యం ఉంది.
మ్యూజియంలో మొదటి బ్లాకులో ఆకాశ, అంతరిక్షయానానికి సంబంధించిన ప్రదర్శన ఉంది. వివిధ విమానాల లైఫ్ సైజ్ నమూనాలతోపాటు మాంచెస్టర్ విమానాశ్రయం పరిణామం పైన వివరంగా డాక్యుమెంటేషన్ కూడా ఉంది. రెండవ బ్లాకు పవర్‌హాల్. ఇందులో స్టీము మిల్లు యంత్రాల, లోకోమోటివ్‌లు, రవాణా యంత్రాల ప్రదర్శన వుంది. జేమ్స్ వాట్ ఆవిరియంత్రం పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన పరిణామాల్ని, ఆవిరి యంత్రాలు పొందిన క్రమ పరిణామాన్ని వర్కింగ్ మోడల్స్‌తో వివరిస్తుంది ప్రదర్శన. నల్లని ఇనుపయంత్రాలు, పొగగొట్టాలు, పళ్ళచక్రాలు, బెల్టులు, ఆవిరి చప్పుళ్ళతో జంతుశక్తినీ, మానవశక్తినీ అణచగలిగిన యంత్రశక్తి ప్రదర్శన శిల్పప్రదర్శనలాగా వుంది. మూడు నాలుగు బ్లాకుల్లో 1830 నాటి రైల్వేస్టేషన్ బిల్డింగ్, మొదటిరైల్వే వేర్‌హౌస్ యథాతథంగా ప్రదర్శింపబడుతున్నాయి.
మూడవ బ్లాకులో అండర్‌గ్రౌండ్‌లో మూడు విశిష్ట ప్రదర్శనలున్నాయి. ఒకటి నేషనల్ గ్యాస్ గాలరీ – గాజుదీపాల క్రమపరిణామాన్ని, గ్యాస్ వినియోగక్రమాన్నీ వర్కింగ్మోడల్స్ వివరించే ప్రదర్శన. రెండవది ‘అండర్ గ్రౌండ్ మాంచెస్టర్’ పేరిట నగరపారిశుద్ధ్యంపైనా, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజిపైనా, మెట్రోవాటర్ వర్క్స్ పైనా వివరంగా చర్చించిన ప్రదర్శన. పారిశ్రామికీకరణలో నగరాలు ఎదుర్కొనే పారిశుద్ధ్యసమస్యలు, మురికివాడల సమస్యలు, వాటిని మాంచెస్టర్ నగరపాలన పరిష్కరించుకుంటూ వచ్చిన తీరు విశదీకరించబడ్డాయి. మూడవది ‘మేకింగ్ ఆఫ్ మాంచెస్టర్’ పేరిట మాంచెస్టర్ చరిత్రనీ, పరిణామాన్ని వివరించే అద్భుతమైన డాక్యుమెంటేషన్. ఆ ప్రదర్శనలో చార్టులు, పోస్టర్లు, ఫోటోగ్రాఫులు, కార్టూన్లు, ఆర్టిఫ్యాక్ట్స్తోపాటు లైఫ్ సైజ్ వర్కింగ్ మోడల్స్, పదినిమిషాల సౌండ్ అండ్ లైట్ షో కూడా ఉన్నాయి. సాహిత్యం నుంచీ, చారిత్రక పత్రాల నుంచీ, ట్రావెలాగ్స్ నుంచీ సేకరించిన అమూల్య సమాచారం వుంది. మాంచెస్టర్ గురించిన నా అవగాహనకు నేను ఆ ప్రదర్శనకి ఎంతో ఋణపడిఉన్నాను. మన దేశంలోని ప్రతినగరంలోనూ ఆయా నగరాల పరిణామం గురించిన అటువంటి మ్యూజియం తప్పకుండా ఉండి తీరాలి.
అయిదవ బ్లాక్‌లోని మెయిన్ అడ్మిషన్ పాయింట్, లైబ్రరీ, రికార్డ్ సెంటర్, ఇన్ఫర్మేషన్ పాయింట్‌తోపాటు లోయర్ బైరీమ్ స్ట్రీట్ వేర్‌హౌస్ ఉన్నాయి. వీటితోపాటు ‘చైనా-క్రేడిల్ ఆఫ్ నాలెడ్జ్’ పేరిట ఏడువేల ఏళ్ళ చైనాచరిత్రలో శాస్త్రీయ విజ్ఞానపరిణామాన్ని చూపించే ప్రత్యేక ప్రదర్శన కూడా ఉంది. వైద్యం, నౌకాయానం, ఖగోళశాస్త్రం, వాస్తు, కంచుపని, తుపాకిమందు, వస్త్ర పరిశ్రమ, పింగాణి, వ్యవసాయం, యంత్ర పరికరాలు, లేఖనకళ, ప్రింటింగ్లపై చైనీయ ఆవిష్కరణల విశిష్ట ప్రదర్శన చైనా నుండి తెచ్చిన ఒరిజినల్ ఆర్టిఫ్యాక్ట్స్ తో, కొన్నిటికి యథాతథమైన నమూనాల్తో ఆకర్షణీయంగా ఉంది. ప్రదర్శనలో చిత్రకళ విభాగంలో చైనీయ కవితలు, నీటిరంగుల చిత్రాలు అమ్మకానికి కూడా ఉన్నాయి.
17
The Criterion Theatre
Watching The Complete Works of William Shakespeare (Abridged) at the Criterion Theatre in London was an irreverent barrage directed against British literary vanity, traditional aesthetics, and the pedantry of academic Shakespeareans alike. The performers posted an upfront warning that the production was unsuited for those with heart ailments, lower-back pain, degrees in English literature, or impaired inner ears! Condensing all thirty-seven plays into a breathless ninety-seven-minute sprint, the performance leaves the spectator dizzy.
Do not imagine this “condensation” presents the plays in their entirety or stitches together their celebrated dramatic climaxes! Far from it. All sixteen comedies are dispatched in a single three-minute scene. Their premise: the plot underlying all sixteen comedies is fundamentally identical, which Shakespeare merely refurbished under altered titles; hence, the lot can be disposed of in a single comic turn!
Troilus and Cressida appears as a kitchen routine of slicing vegetables; Romeo and Juliet unfolds as a rapid-fire rock routine; and the seven history plays are tackled as an uproarious football match.
Yet the entire production is one thing, and the staging of Hamlet quite another. Commencing from the intermission, nearly forty minutes are devoted to Hamlet alone. The central motif: that among all of Shakespeare’s dramatic works, there is no greater farce than Hamlet. Ragged, disjointed scenes; characters whose true natures remain opaque; an erratic dramatic momentum that refuses to cohere; and, against this backdrop, the obsessive “Hamlet malady” that has held literature and philosophy in an unyielding grip for five centuries—viewed from this perspective, it is hardly surprising that Hamlet reveals itself as an absurd comedy.
The directors pushed this absurdity and comic irreverence to their absolute limits. Running scenes in slow motion, in hyper-fast forward, sideways, backward, and hauling audience members onto the stage to embroil them in the madness, they prolonged the chaotic farce to the furthest degree possible.
From opening lines to curtain call, the production felt like a joke British society had devised at its own expense—a joke at which it laughed with abandon. It was an assault mounted by a new generation against the consecrated British taste that had, for centuries, built up Shakespeare into a brooding, unfathomable, cosmic monolith. It was a broad parody aimed at the knotted, pedantic, and inflated industry of academic Shakespearean scholarship—a barbed arrow shot by American pop youth culture directly at the sanctities of the Old World.
Yet what remains remarkable is that the scriptwriters—Reed Martin, Austin Tichenor, and Jess Winfield (alongside Daniel Singer)—are in no way inferior to the older generation of scholars in their command of Shakespeare. A theatre critic reviewing the production observed:
“The players have studied their Shakespeare with such fierce precision that the Bard’s lines, uttered so often in the most ridiculous contexts, struck me with such direct force that I found myself compelled to think about Shakespeare all over again.”
Introducing their creative and technical personnel in the program, they included an entry for William Shakespeare himself:
“William Shakespeare: Deceased playwright. Believed to have written some or all of the 36 plays published in the First Folio. Though generally regarded as enthusiastic, there is no evidence to suggest he was particularly fond of parties or showed any aptitude for Chinese checkers. The Reduced Shakespeare Company is convinced that were Shakespeare alive today, he would not only have wholeheartedly endorsed this interpretation of his works, but would have enlisted in the company the moment the curtain fell.”
The Criterion is a quintessential nineteenth-century playhouse. Erected in 1870 as a grand restaurant complex, its subterranean chamber was converted into a theatre in 1874. Until nearly 1899, the actor Charles Wyndham managed the theatre personally, staging drawing-room comedies.
The playhouse maintained its performances even through wartime; during the Blitz of the Second World War, its subterranean auditorium served as a bomb-proof broadcasting studio for the BBC. Following the war, the Criterion renewed its renown by championing avant-garde drama, including the English-language premiere of Samuel Beckett’s Waiting for Godot (1955). Though refurbished extensively after 1992, the Criterion continues to enchant actors and audiences alike as an intimate Victorian jewel box in the heart of London.
What captivated me most about the theatre was its intimate architectural scale. Throughout the performance, the warm proximity linking the proscenium to the auditorium dissolves the divide between actor and spectator, transforming them into companions. The spectator surrenders to the affectionate illusion that a handful of close friends have stepped onto the boards from among their own circle to stage a romp for their private delight. In that illusion of warm intimacy resides the true triumph of theatre—the enduring, enchanting secret that live stagecraft commands over cinema.
18
A City of Museums
Manchester may well be called a city of museums. It boasts several remarkable institutions, such as the National Museum of Labour History, the Museum of Transport, and the Lancashire Mining Museum; yet alongside the Manchester Museum, we were able to visit only the Museum of Science and Industry. Spread across five historic blocks at Deansgate in the ancient Roman quarter of Castlefield, this award-winning institution holds singular importance, rooted as it is in the world’s very first industrial metropolis.
The first block of the museum is devoted to aeronautics and space flight. Alongside life-sized vintage aircraft, it offers comprehensive documentation detailing the historic evolution of Manchester Airport.
The second block houses the Power Hall, displaying working steam-mill engines, early locomotives, and heavy transport machinery. Through operable working models, the exhibits trace the profound transformations unleashed across the industrial landscape by James Watt’s steam engine and its subsequent mechanical evolution. With massive black iron engines, towering smokestacks, interlocking gears, heavy leather driving belts, and the hiss of steam, this mechanical arena—which systematically subdued human and animal muscle to the power of the machine—struck me as an epic gallery of kinetic sculpture.
The third and fourth blocks preserve, in their original condition, the 1830 passenger railway station and the world’s first railway warehouse.
In the subterranean vaults of the third block are three specialized exhibitions. The first is the National Gas Gallery, which traces the evolution of gas lighting and domestic utilities through working models.
The second, titled Underground Manchester, mounts a detailed examination of civic sanitation, subterranean drainage networks, and municipal waterworks, illustrating the severe sanitary crises and slum squalor generated by runaway industrialization, alongside the engineering responses devised by the Manchester Corporation over decades.
The third is The Making of Manchester, an archival documentation detailing the rise and evolution of the city. Alongside maps, posters, archival photographs, cartoons, and authentic artifacts, the gallery incorporates life-sized working models and an evocative ten-minute sound-and-light installation. Drawing upon literature, state archives, and historical travel diaries, it provides an invaluable repository of civic memory. My own grasp of Manchester owes an immense debt to that exhibition. Every major city in our own country ought to possess an equivalent museum documenting its historical evolution.
The fifth block houses the main admission concourse, a library, an archival records center, and an information hub, alongside the historic Lower Byrom Street warehouse.
Complementing these was a special visiting exhibition titled China: Cradle of Knowledge, tracing seven millennia of scientific, technological, and medical innovations across Chinese history. Featuring authentic artifacts brought directly from China alongside faithful replicas, the exhibition mounted displays covering ancient Chinese breakthroughs in medicine, navigation, astronomy, architecture, bronzework, gunpowder, sericulture, porcelain, agriculture, mechanical contrivances, calligraphy, and moveable-type printing. In the fine arts section, classical Chinese poetic scrolls and brush-and-ink watercolors were also available for acquisition.
20-10-2026


What an unusual and interesting play you have watched, Sir!!
“కానీ విశేషమేమంటే, స్క్రిప్టు రచయితలు రీడ్ మార్టిన్, ఆస్టిన్ టిచ్నర్, డేరియల్ సింగర్ తమ షేక్స్పియర్ పాండిత్యంలో పాతతరం పండితులెవరికీ తీసిపోకపోవడం.”
I am sure it takes an equally good command of Shakespeare to appreciate such an intelligent and irreverent take on his works. 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
నమస్కారములు….ఓగొప్పయాత్రనుచేసినమీరుఈతెలుగుప్రపంచంకోసంమీయాత్రావిశేషాలనుగొప్పగామలిచారు…..ఆధునికవిగా,రచయిత,అనువాదకులు గా మీరు మీకోసం,మాకోసం,సమాజంకోసరము,మీజీవనయానంలోనాద్రుష్టిలోఓగొప్పహ్యుమన్బీయింగుగా,వక్తగా,అధికారిగా,సేవకుడిగా,నిశ్చలమనస్తత్వంతోకాలాన్నివెనక్కునెట్టుకుంటూముందుకుసాగుతున్నారు…తరాలలోనిఅంతరాలనుతేడాలను,మీయాత్రావిశేషాలలోజోడించడంనాకుచాలానచ్చింది…..అతి దగ్గరగా మిమ్ములను నేను చూసాను..మీలోపలమనిషినికూడానేనుచూసాను.క్రతజ్నతలు.