గాలిపటాలు పూసేకాలం

భాద్రపదం చివరి దినాల్లో రెల్లు పూసినట్టు
మలి హేమంతంలో గాలిపటాలు పూస్తున్నాయి.

ఆకాశమంతా విరబూసిన పూలతోటల్లోంచి
రాలిపడ్డ రేకల్తో ప్రతిచెట్టూ ఒక పూలమొక్క.

వీథుల్లో పిల్లలు దారం కొసలుపట్టుకుని
పడవలు నడుపుకుంటూ పోతున్నారు పైపైకి.

ప్రపంచం మీద యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నవి
కానీ పిల్లల గగనతలమ్మీద సంతోషానిదే రాజ్యం.

వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారనుకుందామా
ఆకాశం తలుపులు ఒకటొకటీ తెరుస్తున్నారు.

స్వర్గానికి నిచ్చెనలు కట్టుకుంటున్న పిల్లలవెనక
ఇప్పుడు నగరం కూడా నింగిబాట పట్టింది.

16-1-2026

14 Replies to “గాలిపటాలు పూసేకాలం”

  1. “పిల్లల గగనతలమ్మీద సంతోషానిదే రాజ్యం!”
    చాలా బాగుందండీ.. మీ శైశవగీతం!

  2. మధురం.. గాలి పటాలతో పిల్లల ఉత్సాహ పరవళ్ళను .. ఇలా.. మీలా చూసిన వారెవ్వరూ నాకు కనిపించలేదు. దండాలు మీకు.

Leave a Reply