ప్రత్యూష పవనాలు

ప్రత్యూష పవనాలు చిన్న పుస్తకం. కొందరు మహాత్ముల రచనలనుంచి ఏరి కూర్చిన కొన్ని వాక్యాలు. 1996 లో వెలువరించిన ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా లభ్యంగా లేదు. కొత్తగూడెం కి చెందిన కిరణ్ గారి పుణ్యమా అని అప్పటి పుస్తకం పిడిఎఫ్ ఒకటి దొరికింది. దాన్ని ఇలా లే ఔట్ మార్చి రెండో ముద్రణగా మీతో పంచుకుంటున్నాను. మంచిమనిషి వెలమూరి శ్రీరాం స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను.

నేను తిరిగిన దారులు-6

'ఇదే, ఈ స్వామి విశిష్టత. నువ్వు సరాసరి దుమ్ము కొట్టుకున్న నీ పాదాల్లోనే, నీ మార్గాయాసంతోనే నేరుగా ఆయన్ని పలకరించవచ్చు. దీన్నే ధూళిదర్శనమంటారు. తన దర్శనం కోసం ఎన్నో మైళ్లు అడవుల్లో, కొండల్లో పడివచ్చిందే నిజమైన శ్రద్ధ. ఇక ప్రత్యేకనియమ బంధాలెందుకులే అనుకునే స్వామి ఈయన.

నేను తిరిగిన దారులు-5

కాని శివుడట్లా కాదు. ఆయన లార్డ్‌ ఆఫ్‌ ద పెరిఫెరీ. శుష్కభూముల్లో, ఊషరక్షేత్రాల్లో, దొంగల్లో, కుక్కల్లో కూడా ఆయన్ని చూడగలమంది వేదం. ఎక్కడెక్కడ జీవితం విస్మృతికి లోనయ్యిందో, శ్రద్ధకి నోచుకోకపోయిందో, ఏది నిర్ణనం, దుర్గమం, అగమ్యంగా గోచరిస్తుందో అదంతా ఆయన నివాసమే. ..