ఇక్కడ నీలో అంత భావసంచలనం కలిగించింది స్త్రీనా, పురుషుడా అన్నదాని పట్ల నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. కావలసింది అలా సంచలించిపోగల అటువంటి హృదయం. లాంగినస్ కి ఆ సంగతి తెలుసు.
ప్రియమైన శాఫో-11
ఎంత చిత్రమైన వాక్యశకలమిది! 'నేనొక్కతనే' అని అంటూనే నువ్వెంతమందిని ఈ వాక్యం దగ్గరికి రప్పించుకున్నావో కదా. ఎన్ని యుగాలు గడిచిపోయాయి, కాని నువ్వట్లానే ఉన్నావు, ఒక గ్రీకు పానపాత్రమీద చిత్రించిన యువతిలాగా, యాపిల్ కొమ్మన పండిన పండులాగా, నిత్యయవ్వనిగా. ..
ప్రియమైన శాఫో-10
అందుకనే శాఫో, నీ ప్రేమ స్త్రీలకి మాత్రమే పరిమితమైన ప్రేమ అని ఎవరన్నా చెప్తే నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. కాదు, ఆమె స్త్రీల పట్ల ఆరాధన చూపించింది గాని, అంతకు మించి మరేమీ లేదు అని ఎవరన్నా సర్దిచెప్పబోతే కూడా ఆశ్చర్యమనిపిస్తుంది.
