తాళ్లు కట్టి మరీ

తాళ్లు కట్టి మరీ ఈ నగరాన్ని మేఘాలు
ఎక్కడికో తరలించుకుపోతున్నవి.
పల్లెల్లో పిల్లలు బస్సు వెనుక పరిగెత్తినట్టు
కోకిల ఒకటే కేరింతలు కొడుతున్నది.

20-7-2024

9 Replies to “తాళ్లు కట్టి మరీ”

  1. Satya Sai - Vissa Foundation సత్యసాయి - విస్సా ఫౌండేషన్ says:

    మా చిన వీరభద్రుడి గారి చిన్ని చిన్ని ఏక వాక్య మహా కావ్యాలు మాత్రం మమ్మల్ని ప్రతి నిత్యం ఎక్కడికో తీసుకుపోతున్నాయి, మనసు ఒకటే రొద అక్కడ నుంచి తిరిగి రానని

  2. అందంగా చెప్పారు. అనంతానందాన్ని పంచారు.

  3. బస్సు వెనుక పిల్లల దృశ్యంతో పోల్చడం అద్భుతంగా ఉంది సార్

Leave a Reply