పునర్యానం-44

ఏళ్ళ మీదట నెమ్మదిగా ఈ నగరం తన అంతరంగాన్ని నాతో పంచుకుంటున్నది అని అనిపించిన కొన్ని క్షణాలు ఉన్నాయి. కాని ఆ నగరం నలుగురికీ తెలిసిన నగరం కాదు. గజాల లెక్కన మనుషులు బేరమాడుకుంటున్న నగరం అస్సలు కాదు. అది మరొక నగరం. ఆ రెండో నగరంతో నాకు తెలీకుండానే నేను ప్రేమలో పడ్డానని తెలిసినప్పుడు రాసిన కవిత ఇది.