పునర్యానం-39

కాని దానికన్నా ఎన్నో రెట్లు అధికమైంది దివ్యానందం. అది ఈ ప్రపంచం నుంచే పొందేదేగానీ, ఈ ప్రపంచపు కొలతలకు అందేది కాదు. అది సాఫల్య, వైఫల్యాలకు అతీతమైంది. అన్ని రకాల లెక్కలకీ అవతలది. కబీరు అంటాడే 'నువ్వు వెళ్ళబోయే దేశంలో సంతలూ, దుకాణాలూ ఉండవు' అని. అట్లాంటి దేశానికీ, లోకానికీ చెందిన అనుభూతి అది.