పునర్యానం-38

ఇంతకీ శత్రువు బయట ఉన్నాడో, లోపల ఉన్నాడో అతణ్ణి పగటిపూట నలుగురూ చూస్తూ ఉండగా వధించగలమో లేదా భావజాల గగనతలంలో మట్టుపెట్టగలమో, ఆయుధాలతో చంపగలమో, లేదా అరచేతుల్తో చంపగలమో ఎంతకీ తేలని చర్చ.