పునర్యానం-41

నిజానికి ప్రతి ఒక్క కవీ కోరుకోవలసింది ఇదే. అది శ్రోతతాలూకు అమంగళాన్ని పోగొట్టడం కన్నా ముందు కవి జీవితంలోని అమంగళాన్ని పోగొట్టాలి. ఒక కవిత అలా నాలోని శివేతరమైనదాన్ని క్షాళితం చేస్తుందని తెలిసిన తర్వాత, ఇక నేను కవిత్వ చరణాలు పట్టుకుని ఒక్కరోజు కూడా వదిలింది లేదు.