పునర్యానం-43

కాని మరొక తరహా కవిత్వం ఉంటుంది. అదేమీ చెయ్యదు. ఎవరిని ఎటువైపూ నెట్టదు, ఎవరినీ భూషించదు, దూషించదు, శ్లాఘించదు, శపించదు. అది చేసేదల్లా ఒక పిచుక చిన్న గడ్డిపోచలు తెచ్చుకుని గూడు కట్టుకున్నట్టుగా, చిన్న చిన్న క్షణాల్ని పట్టుకుంటుంది.