దిమ్మరి

కాని ఈ పుస్తకం వేరు. ఇందులో విరాగి కాదు, రాగమయి కనిపిస్తుంది. ఒక ప్రేమసముద్రాన్ని గుండెలో మోసుకుంటూ తిరుగుతున్న ప్రేమికురాలు కనిపిస్తుంది. ఒక తల్లి కనిపిస్తుంది, ఒక చెల్లి, ఒక అక్క, ఒక క్లాస్ మేట్, ఒక సహచరి, ఒక క్షమామూర్తి, చివరికి, 'నగ్నపాదాలు 'అనే రచనలో ఆమె కోపం కూడా కనిపిస్తుంది.