ఏమీ అక్కర్లేదు, కనీసం కళాశాల వార్షికోత్సవానికి ఒక నాటకం వెయ్యడానికి పూనుకున్నా కూడా కలిసి పనిచెయ్యడంలో ఉండే ఉత్సాహాన్ని , అది పిల్లలకి రుచిచూపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి సామర్థ్యాల్నీ, బలహీనతల్నీ కూడా మరొకరు సహానుభూతితో చూడగల సంస్కారాన్ని అలవరుస్తుంది.
సినిమాలు తీస్తే అలా తియ్యాలి
మన సాహిత్యం, మన సినిమాల్లో ఈ సంఘర్షణ ఏమైనా చిత్రితమవుతూ ఉందా? మన రచయితలూ, మన దర్శకులూ మనల్ని ఉత్తేజపరచగలుగుతున్నారా? - దాదాపుగా ప్రతి రోజూ ఈ ప్రశ్నల మధ్యనే నాకు రోజు తెల్లవారుతుంది. ఏ ఒక్క పుస్తకమేనా, ప్రసంగమేనా, సినిమా, నాటకం, చివరికి ఒక్క సంపాదకీయమేనా నాకు లేశమేనా ధైర్యాన్నివగలదా అని రోజంతా గాలిస్తుంటాను. ఆధునికజీవితం అభయప్రదమని నన్ను నమ్మించగలిగినవాళ్ళు ఒక్కరంటే ఒక్కరేనా ఉన్నారా అని ఆశగా వెతుక్కుంటూ ఉంటాను.
అరుదైన కవి
యూరోప్‌లో ఒకప్పుడు రూబెన్స్ అనే చిత్రకారుడు ఉండేవాడు. అతడు స్త్రీల ముఖచిత్రాల్ని చిత్రిస్తున్నప్పుడు ఆ లావణ్యం, ఆ యవ్వనం, ఆ తాజాదనం ఎంత సహజంగా ఉండేవంటే, దాన్ని వర్ణించడానికి మాటలు రాక, కళాప్రశంసకులు, అతడు తన రంగుల్లో ఇంత నెత్తురు కూడా కలుపుతున్నాడా అని ఆశ్చర్యం ప్రకటించారు. మానవదేహాల్లో పొంగులెత్తే ఇంత వేడినెత్తురు కూడా తన అక్షరాల్లో కలిపి సైదాచారి కవిత్వం రాసాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను
