4,00,000 ఏళ్ల వెనక్కి

అతడు వాటిని నాలుగు లక్షల ఏళ్ళ కాలానికి సంబంధించినవిగా చెప్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. అదేమంటే పురావస్తు శాస్త్రంలో పురావస్తు అవశేషాల కాల నిర్ధారణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని,  ఆ కాలనిర్ధారణకు అవసరమయ్యే వ్యయాన్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు గాని సంస్థలు గాని ముందుకు రాగలినప్పుడే ఆ ప్రాంతం తాలూకు పురాచరిత్ర నలుగురికి మరింతగా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పాడు.

60,000 వేల ఏళ్ల వెనక్కి

అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో చేపట్టబోయే తవ్వకాల్లో ఒక మానవ శిలాజంగాని  లభిస్తే అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి ఉండదు. ఒక తుంటి ఎముకగాని, ఒక పుర్రె గాని కనీసం ఒక దంతం దొరికినా కూడా అది ప్రపంచ మానవ చరిత్రలో భారతదేశానికి గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టగలదు.

తలపుల్ని తలపులతోటే శుభ్రం చెయ్యాలి

ఆనందం, ధైర్యం, విశ్వాసం కొరియర్లో ఇంటికి వచ్చేవి కావు. తెల్లవారిలేచి చూస్తే అడుగడుగునా, అనుక్షణం అవి మనమీద ధారాళంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనమింకా నిశ్చింతగా మన హృదయావేదనని అక్షరాల్లో పెట్టగలుగుతున్నాం.