ప్రసంగకళని దాటిన మధురనిశ్శబ్దం

కవిత్వం మొదటిదశలో ప్రసంగం, రెండవ దశలో పద్యం. కాని మూడవ దశలో ప్రార్థనగా మారాలి. ప్రసంగదశలో కవి ఉన్నాడు, ప్రపంచముంది. రెండవ దశలో కవి ఉన్నాడు, ప్రపంచం లేదు, కాని కవి అంతరంగముంది. మూడవ దశలో కవి కూడా అదృశ్యమై కేవలం అంతరంగమొకటే మిగలవలసి ఉంటుంది. అప్పుడు, అటువంటి దశలో, పలికిన మాటలు మంత్రాలవుతాయి.

ఇన్నిస్ ఫ్రీ సరోవరం

నిన్న రామారావు కన్నెగంటి ఫేస్ బుక్ లో ఇన్నిస్ ఫ్రీ  చెరువు దగ్గరికి వెళ్ళి ఫొటో తీసి 'భద్రుడూ, ఇది మీ శరభవరం' అని రాసి నన్ను సంతోష సంభ్రమానికి గురిచేసాడు.