ఇద్దరు ప్రేమికుల మధ్య వారి ప్రేమకి నిజమైన గుర్తు వస్తువులు కాదు, నగలు కాదు, కానుకలు కాదు. ఒకరినొకరు అత్యంత గాఢంగా ప్రేమించినప్పటి ఒక జ్ఞాపకమే అని చెప్పడంలో మహర్షి చూపించిన ఈ మెలకువ నన్ను చకితుణ్ణి చేసింది.
ఆషాఢ మేఘం-19
కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.
ఆషాఢమేఘం-6
ఒక కావ్యంలోగాని, ఇతిహాసంలోగాని, పురాణంలోగాని వర్ణన కోసమే వర్ణన చేసేవాడు సాధారణ కవి. కాని మహాకవి ఆ వర్ణనని కథలో పొదుగుతాడు. కథాప్రయోజనానికి ఆ వర్ణనని కూడా ఒక ఆలంబనం చేసుకుంటాడు. కిష్కింధా కాండలోని ఈ వర్షర్తు వర్ణన ప్రయోజనం కేవలం నాయకుడి విరహాన్ని చెప్పడం కోసమే అయి ఉంటే ఇది భావుకుల్ని ఇంతగా ఆకర్షించి ఉండేది కాదు.
