నా హృదయం కూడా లోతైనదే. కాని ప్రతిఫలించవలసిన ఆ ప్రతిబింబం ఏదీ? ఆ పూర్వకాలపు రాకుమారుడిలాగా, నాకు కూడా ఒక కవిత దొరికితే తప్ప, ఇక్కడి నా బస నివాసంగా మారదు.
వెలుగు రాజ్యం చేసే కాలం
అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? ఆ తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.
రాముడు నడిచిన దారి
కాని రామాయణంలో ఉండే విశిష్టత ఏమిటంటే, వాల్మీకికి పూల గురించి మాత్రమే కాదు, ఏ పూలు ఎప్పుడు పూస్తాయో, ఏ పూలు ఎక్కడ పూస్తాయో కూడా తెలుసు. వసంత శోభని వర్ణించినప్పుడు మాత్రమే కర్ణికార పుష్పాల గురించి వర్ణిస్తాడు.