సాహిత్య సంస్కారం

2010 నుంచి 2017 మధ్యకాలంలో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు 'సాహిత్య సంస్కారం' పేరిట ఎమెస్కో ప్రచురణగా వెలువడ్డాయి. ఈ పుస్తకంలోని 64 వ్యాసాల్లో కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యప్రక్రియలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అధ్యయనాలకు సంబంధించిన గ్రంథాల పరిశీలన ఉంది.

పునర్యానం

ఆధునిక జనజీవితపు తొక్కిడిలో, అలజడిలో, ఆందోళనలొ, అస్తిమితంలో ఓ మహాకావ్యనిర్మాణం జరగటమనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. దాన్ని నిజం చేసింది పునర్యానం. ఈ నిర్మాత చినవీరభద్రుడు. ఈయన రచనలన్నీ సహృదయునికి ప్రేమలేఖలే.