భారతసావిత్రి

మొత్తానికి మహాభారతం చదవడం పూర్తిచేసేసాను. డా. తిప్పాభొట్ల రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు చేసిన అనువాదం ఇంతదాకా తెలుగులో వచ్చిన వచన అనువాదాల్లో ప్రశస్తమైందనిపించింది. శ్రీ లలితా త్రిపుర సుందరీధార్మిక పరిషత్ గుంటూరు వారు ప్రచురించిన 20 సంపుటాలు (2010)మూలానికి పూర్తి విధేయంగా ఉండటంతో బాటు సరళమైన శైలి.