కృష్ణా పుష్కరాలు

పుష్కలావర్తాలు లేకపోయినా పుష్కరం పుష్కరమే కదా. నేనెప్పుడూ ఏ పుష్కరాలకీ ఏ నదీతీరంలోనూ ఉండలేదు.ఈ సారి అనుకోకుండా,కృష్ణవేణి ఒడ్డున నివసించడం మొదలుపెట్టగానే పుష్కరాలు రావడం చాలా సంతోషమనిపించింది. పుష్కరాలు ఒట్టి స్నాన క్రతువు కాదు.