జీవన శిల్పి-5

నేనేమో చాలా చింతలో ఉండేవాడిని- ఎలా బతకాలి, ఏం చేయాలని. కానీ ఆ సంఘటన జరిగిన రోజు నాకు నమ్మకం కుదిరింది. ప్రపంచంలో పుట్టాము అంటే బతికేస్తాం ఎలాగోలా! పుట్టించినవాడే ఆలోచిస్తాడు, మనకెందుకు చింత అని. నేను పూర్తిగా ప్రశాంతంగా అయిపోయాను. మనసు ప్రశాంతమైన కొన్ని రోజులకే బరోడా వదిలేసి వచ్చేశాను.