నేను తిరిగిన దారులు-15

విశాలమైన మైదానం మరొక మహావిశాలమైన మైదానంలో కలసిపోతున్నట్లుగా పల్చగా పరుచుకున్న గోదావరి మహాసాగరంలో సంగమించే అపురూప దృశ్యం, ఎటుచూసినా అపారజలరాశి తప్ప, మరేమీ కనిపించని ఆ దృశ్యాన్నీ, ఒకటొకటిగా ఈ మహాశిఖర చరణాల చెంత బొట్లుబొట్లుగా పడుతున్న ఈ జలదృశ్యాన్నీ మనసులో పక్కపక్కన పెట్టి పోల్చుకోవడానికి ప్రయత్నించాను.

ఆషాఢ మేఘం-19

కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.

ఆషాఢ మేఘం-17

గాథాసప్తశతిలో కవయిత్రులు నన్నాపేస్తున్నారు. దాదాపు రెండువేల ఏళ్ళ కిందట కవిత్వం చెప్పిన ముగ్ధలూ, ప్రౌఢలూనూ. మమ్మల్ని నీ మిత్రులకి పరిచయం చెయ్యవా అని అడుగుతున్నారు.