అయితే నేను చేసిన ప్రయాణాలు ఏ భౌతిక సాగరాల మీదా చేసినవి కావు. అవి విద్యారంగంలో చేసిన ప్రయాణాలు. భూమ్మీది సప్తసాగరాల్లోనూ ఉన్న రత్నాలరాసులకన్నా విలువైన రత్నాల్ని తనలో ఇముడ్చుకున్న విద్యాసముద్రం మీద నేను చేసిన ప్రయాణాలు.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-3
నేడు మన పాఠశాలల్లో టెక్ట్స్ బుక్‌లోని విషయాన్నే అధికంగా భావించి దాన్ని కుదించి గైడుగా రూపొందిస్తున్న పరిస్ధితితో ఈ భావనని పోల్చి చూడండి. తను బోధిస్తున్న వాచకం కన్నా దాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు మరింత ఉన్నతంగా కనబడినంతకాలమే ఆ ఉపాధ్యాయుడిని పిల్లలు గౌరవిస్తారు. అతని పాఠాల కోసం ఎదురుచూస్తారు. ..
