అందులో మాష్టారు అప్పటికప్పుడే తన ధారణలోంచి చదివిన పద్యాల్నీ, శ్లోకాల్నీ, పద్యపాదాల్నీ, శ్లోక పాదాల్నీ గుర్తుపట్టడం దానికదే ఒక classical education అని అర్థమయింది. ముందు ఈ ప్రసంగం వినండి. వ్యాసం మొదట్లోనే ఆడియో ఫైలు రూపంలో ఉంటుంది. దాన్ని మీరు డౌను లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాసం చదవండి.
ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో
మనం అటువంటి పాఠకులం కావాలన్నదే నా జీవితకాల సాధన. అందులో భాగంగా, గతంలో ప్రపంచ కవిత్వం పైన నా స్పందనల్ని 'ఎల్లలోకము ఒక్క ఇల్లై' (2002) పేరిట మీతో పంచుకున్నాను. ఆ తర్వాత ఈ మూడేళ్ళుగా చదువుతూవస్తున్న కవిత్వం గురించి రాసిన 37 వ్యాసాల్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. 'ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో' అనే ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
మహాకావ్యపరిచయం
సాధారణంగా మనుషులు స్త్రీపట్లా, కవిత్వం పట్లా తొందరగా మాట తూలతారని భవభూతి అన్నాడని గుర్తు చేస్తూ, తన ప్రసంగసారాంశంగా ఆయన చెప్తున్నదేమిటంటే, గొప్ప కవిత్వాన్ని సమీపించడానికి, అనుభవమూ, మననమూ కావాలి తప్ప bookish knowledge కాదని. ఈ ప్రసంగమంతా విన్నాక నాకేమి అర్థమయిందంటే ఒక మహాకావ్యానికి కాలనియంత్రణ లేదని.
