సాంస్కృతికంగా కళాసాహిత్యరంగాల్లో, వర్తమానజీవితంలో ఆ ఊరు నిర్వహిస్తున్న పాత్ర శూన్యమని కూడా చెప్పవచ్చు. కాని భారతీయ శిల్పకళాసామ్రాజ్యానికి మాత్రం హళెబీడు ఒక శాశ్వతరాజధాని. నా జీవితంలో నేనంతముందుగానీ, ఆ తరువాతగానీ అటువంటి శిల్పకళా వైభవాన్ని మరెక్కడా చూడలేదు.
