శ్రీముఖలింగం

ఆ కథ మొదలుపెట్టగానే, ఒకప్పుడు దేవుడు ఇక్కడ ఇప్పచెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యాడని వినగానే నాకు స్పృహతప్పింది. శ్రీకాళహస్తినుంచి చిదంబరందాకా గాలిగా, నీటిగా, నిప్పుగా, మట్టిగా, శూన్యంగా దర్శనమిచ్చిన సర్వేశ్వరుడు ఇక్కడ ఇప్పచెట్టులో ప్రత్యక్షమయ్యాడట!