జీవన శిల్పి-26

అంతకంటే ముందు మనదగ్గర ఇన్ని టాక్స్ లు లేవు. ప్రజల మీద టాక్స్ లు లేవు. రాజులు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న నియమమూ లేదు. రాజుల వైపునుండి చట్టాలు రావడం, వాటిని గ్రామాల్లో కొట్టికోట్టి అమలు చెయ్యడం ఇవేమీ లేవు. గ్రామవ్యవస్థల్లో రాజు అస్సలు జోక్యం చేసుకునేవాడు కాడు. 'మీ గ్రామం మీది, మీ నీరు, మీ అడవి, మీ భూమి మీవి. మిమ్మల్ని మీరు ఎలా క్రమబద్ధం చేసుకుంటారో అలా చేసుకోండి' అనేవాడు.

జీవన శిల్పి-25

ఎనభై నాలుగు సంవత్సరాల జీవితంలో నేను చూసిన ప్రపంచంలో అందరూ మంచివాళ్లే లేరు, చెడ్డవాళ్లు కూడా ఉన్నారు. కానీ నా అదృష్టవశాత్తూ ఏ మంచివాళ్లని కలిసానో వాళ్ల గురించే నా ‘యాది’లో రాశాను. చెడు గురించి పాఠాలు చెబితే ఏమీ పనిచేయదు, మనకు ఎదురైన మంచిని మాత్రమే నలుగురికీ పంచుదాం. ..

జీవన శిల్పి-24

ఈ రంగులకి తమదైన ఒక తత్త్వం ఉంది. ప్రతి ఒక్క రంగుకీ ఒక ఫిలాసఫీ ఉంది.  స్త్రీలకు నీలం రంగు ధరించే హక్కు ఉండేది. కానీ చాలా తక్కువ సమయంకోసం మాత్రమే. వర్ణనల్లో చూడండి. ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినప్పుడు నీలం రంగు చీర ధరించి వెళ్ళిందట. నీలం రంగులో ఉన్న గొప్పదనం ఏమిటంటే అది ఇతరులను ఆకర్షించే రంగు. ..