వెళ్ళిపోతున్న వసంతం

జీవితంలోని క్షణభంగురత్వాన్ని రాలుతున్న పూలు స్ఫురింపచేసినంతగా మరే దృశ్యమూ స్ఫురింపచెయ్యలేదనుకుంటాను. కాని చిత్రమేమింటంటే, ఈ దృశ్యం వైరాగ్యాన్ని మేల్కొల్పదు. అంతకన్నా కూడా జీవితం పట్ల మరింత ఇష్టాన్నే పెంచుతుంది