ఉష్ణీశ పరిత్యాగ శిల్పం

మనం మరుక్షణం ఉండము, నిజమే, కానీ, ఈ క్షణం ఈ శిల్పం ఎదట నిలబడ్డప్పుడు, బుద్ధుడి ఆత్మవిజయ క్షణం మనం అనుభూతి చెందుతాం. అది చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతున్నదంటే, మనలో కూడా బుద్ధత్వం మేలుకుంటున్నట్టే కదా. ఈ ఒక్క క్షణం చాలు మనం పుట్టినందుకు.