ఉదారచరితులు: ఒక సమీక్ష

ఈ రోజు పొద్దున్నే ఒక మిత్రురాలు ఫోన్ చేసి 'ఉదార చరితులు' పుస్తకం కావాలని అడిగారు. ఆ పుస్తకం పల్లవి పబ్లికేషన్స్ వేసారనీ, నా దగ్గర కాపీలు లేవనీ అన్నాను. కానీ ఆమె అక్కడితో ఆగక నవోదయ బుక్ హౌస్ వారిని పట్టుకుని ఒక పుస్తకం వెంటనే ఆర్డరు పెట్టారు. ఆ పుస్తకం మీద ఈ నెల 'రామకృష్ణ ప్రభ' లో శ్రీ బి.సైదులు అనే ఆయన రాసిన సమీక్ష చదవగానే ఆ పుస్తకం ఎలాగేనా వెంటనే చదవాలని అనిపించిందట ఆమెకి.

నిజంగా ఉదారచరితులు!

ఉదారచరితులు పుస్తకం మీద మిత్రులు కల్లూరి భాస్కరంగారు రాసిన సహృదయ స్పందన. వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నా పుస్తకాల్లో ఇంత సమగ్రమైన సమీక్ష ఇదే మొదటిసారి నేను చదవడం!

ఉదారచరితులు

సాహిత్యం మీద మాత్రమే కాకుండా చరిత్ర, సమాజం, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద నేను పాతికేళ్ళుగా రాస్తూ ఉన్నాను. అటువంటి వ్యాసాలతో గతంలో సోమయ్యకు నచ్చిన వ్యాసాలు పేరిట ఒక సంపుటం కూడా వెలువరించాను. అదే క్రమంలో రాస్తూ వచ్చిన మరొక 36 వ్యాసాల్ని ఇలా 'ఉదారచరితులు' పేరిట మీకు అందిస్తున్నాను.