అంజనగంధి

వాల్మీకి నుంచి టాగోర్ దాకా భారతీయ కావ్యవాక్కుకి ప్రాణం పోసిన సరస్వతి వేదవాక్కు. అనుభవాన్ని అక్షరంగా మార్చే విద్య వేదఋషులకి తెలిసనట్టుగా మరెవరికీ తెలియదేమో. వేదాన్ని రహస్యవిద్యగానూ, బ్రహ్మవిద్యగానూ సాధారణ పాఠకుడికి అందకుండా చేసినందువల్ల మనం ఇప్పటికే సాంస్కృతికంగా ఎంతో నష్టపోయాం