ఒక యోగి ఆత్మకథ

మహా రచయితలు చేసే రచనలు వాటికన్నా మరొక పెట్టు పైనుంటాయి. ఆ రచయితలు నరకాన్ని చూసిఉంటారు. వాళ్ళ పాత్రలు మృత్యువు ఎదట ముఖాముఖి నిలబడతారు. తలపడతారు. ఆ నరకం నుంచి బయటకి వచ్చి, మళ్ళా మామూలు మనుషులుగా ఇరుగుపొరుగుతో సాధారణ జీవితం జీవించడం మొదలుపెడతారు.