ఈ దేవుడు చూడెలాంటివాడో భక్తులంటే పిచ్చి, వట్టి భోళా. పిలిచిన వెంటనే పరుగెత్తుకొస్తాడు సేవచెయ్యడానికి ఎంత ఆత్రం అతడికి.
అంటున్నాడు తుకా-5
మొత్తం ప్రపంచమంతా దైవమే కావలసిందల్లా చిటికెడు ఉపదేశం మొదట నిన్ను నువ్వు నాశనం చేసుకో అప్పుడు నువ్వేమని బదులిస్తావు?
అంటున్నాడు తుకా-4
వైకుంఠం వదిలిపెట్టిమరీ వచ్చి ఇటుకమీద నిలబడ్డాడు తిన్నగా. భక్తపుండలీకుణ్ణి కలుసుకోడానికి జగజ్జ్యేష్ఠుడు వచ్చేసాడిక్కడికి.
