తన సుర్ సాధన కి మీరా ని రోల్ మోడల్ గా తీసుకున్న ఒక మనిషి కనిపించాక నా సాధన నేనెట్లా కొనసాగించాలో నాకొక దారి కనబడుతున్నది. మేఘాన్ని చూడగానే మనసు వ్యాకులమయ్యే దశలోనే ఉన్నానింకా. కాని మేఘాన్ని చూడగానే వెక్కి వెక్కి రోదించే స్థితికి చేరుకోవాలని తెలుస్తున్నది నాకిప్పుడు.
పాదాలకు మువ్వలు బిగించి
ఆమె రెండు చేతులూ పైకి చాపింది. అడుగులు లయబద్ధంగా కదిపింది. మరుక్షణంలో నాట్యమాడటం మొదలుపెట్టింది. ఆ రాకుమారి, అట్లా నడివీథిలో, సమస్తం మరిచి, నాట్యం చేయడం మొదలుపెట్టింది.