ఈ అపురూపమైన సాహిత్యభాండాగారాన్ని తెలుగులోకి తీసుకురావడానికి పూనుకున్న కుమార్ కూనపరాజుగారికి తెలుగు సాహిత్యలోకం సదా ఋణపడి ఉంటుంది. ఇప్పటికే డాస్టొవిస్కీ రాసిన కరమజోవ్ సోదరులు నవలను ప్రశంసనీయంగా అనువాదం చేసిన అరుణా ప్రసాద్ ఈ కథల్ని అనువదించడం తెలుగు కథకులకు ఊహించని వరం.
కథల సముద్రం-1
జీవితాన్ని ఒక కథకుడు ఎలా సమీపించాలి, తన అనుభవాన్ని కథగా ఎలా మలచాలి, ఎలా ఎత్తుకోవాలి, ఎలా నడపాలి, ఎలా ముగించాలి వంటివన్నీ చెహోవ్ కథల్ని చదివే ఇరవయ్యవ శతాబ్ది కథకులు నేర్చుకున్నారు. మనకి కూడా అదే దగ్గరి దారి.
రావిశాస్త్రి
అటువంటి ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, తిరుగుబాట్లు ఉవ్వెత్తున చెలరేగిన కాలంలో ఆయన జీవించాడు. వాటిని రెండుచేతులా స్వాగతించాడు. ప్రభుత్వం గురించి, రాజ్యం గురించి, పాలనాయంత్రాగం గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు కావాలని తిరుగుబాట్లు చెయ్యరు. కాని ప్రభుత్వాలు వాటిని కావాలని అణచేస్తాయి అని ఆయన పదే పదే చెప్పాడు.