కన్నీటి కథల ధార

ఆ పుస్తకం నా చేతుల్లోకి వచ్చిన గంటలోనే ఆ కథలన్నీ చదివేసాను. ఇంకా చెప్పాలంటే చదివించేలా చేసాయి ఆ కథలు. అందుకు ఆ కథల్లోని వస్తు, శైలీ, కథన వైవిధ్యంతో పాటు అవన్నీ కర్నూలు జిల్లా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించడమే కారణం.