ఒక విమర్శకుడన్నట్టుగా, వందేళ్ళ తరువాత చలనచిత్రకళ చేస్తున్నది ఇదే కదా. ఆ చిత్రంలో ఉన్నది యథార్థ దృశ్యమే కాని, దాన్ని ఏదో ఒక వ్యాఖ్యానానికి కుదించలేం. రియలిస్టుల్లాగా దానికొక రాజకీయ దృక్పథాన్నిగాని, నాచురలిస్టుల్లాగా ఒక శాస్త్రీయ దృక్పథాన్ని గాని ఆరోపించలేం. అది చూసిన తరువాత మనకు మిగిలేది ఒక దృక్పథం కాదు, విషయపరిజ్ఞానం కాదు, కేవలం ఒక ఇంప్రెషన్ మాత్రమే.