రామరాజ్యం (యూటోపియా) అనేది దివ్యమైనదే అయినప్పటికీ, అది ఆకాశం నుండి ఊడిపడదు; ఈ గడ్డమీదే అది ప్రభవించి వికసించాలి. భారతదేశ ప్రజలు—రాజు గానీ ప్రజలు గానీ, పాలకుడు గానీ పాలితుడు గానీ—సత్యవంతులూ, ధర్మాత్ములూ, నిజాయితీపరులూ అయినప్పుడే భారతదేశం ఒక ఆదర్శ రాజ్యంగా రూపాంతరం చెందుతుంది
