ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటికాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో.
నిజమైన సంతోషం క్రియాపదం
కొన్ని పుస్తకాలు మనదగ్గర చాలాకాలంగా ఉన్నా సమయం వచ్చినప్పుడు కాని మన దృష్టివాటిమీదకి పోదు. గత కొన్నాళ్ళుగా చెప్పలేని మనోవేదనని అనుభవిస్తున్న నాకు నా అల్మైరాలో చాలాకాలంగా నా చేతులకోసం ఎదురుచూస్తున్న పుస్తకమొకటి కనబడింది.
