రంగాచార్య గొప్ప రచయిత, పండితుడు, అన్నీ నిజమే కాని, అన్నిటికన్నా ముందు మనిషి, తోటిమనుషుల కోసం పడిచచ్చేమనిషి. తాను ఇష్టపడ్డవాళ్ళు తననికూడా అంతలా ఇష్టపడాలని కోరుకునే మనిషి, వాళ్ళట్లా ఇష్టం చూపించకపోతే వాళ్ళెందుకు ఇష్టపడరేమని నిర్ఘాంతపోయేమనిషి, ఇష్టపడితీరాలని శాసించే మనిషి.
