ప్రకాశమాన అస్తిత్వాలు

నా పారాయణ గ్రంథాల్లోకి చెస్లావ్ మిలోష్ 'ఎ బుక్ ఆఫ్ లూమినస్ థింగ్స్ ' (1996) చేరి చాలాకాలమే అయింది. మిలోష్ (1911-2004)పోలిష్ కవి, ఇరవయ్యవ శతాబ్దపు ప్రపంచమహాకవుల్లో మొదటి వరసకు చెందినవాడు. రెండు ప్రపంచయుద్ధాలతో పాటు, నాజీ దురాగతాల్నీ, స్టాలిన్ అకృత్యాల్నీ కూడా సమానంగా చూసినవాడు.