అటువంటి కేంద్రాన్ని నేను నా జీవితంలో మొదటిసారి చూడటం. అక్కడ ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంపూర్ణ ముఖచిత్రం చూసాను. ఇంద్రియ సామర్థ్యాలు ఇంకా పూర్తిగా వికసించని పిల్లలు, గ్రహణ సామర్థ్యాలు వయసుకి తగ్గట్టుగా వికసించని పిల్లలు, శారీరికంగానూ, మానసికంగానూ ఇంకా తమ కాళ్ళ మీద తాము నిలబడలేని పిల్లలు దాదాపు ఇరవై మందికి పైగా ఉన్నారు.