నేను కూడా ఇన్నాళ్ళూ పుస్తకాలు చదవడానికి సమయమొక్కటే పరిమితి అనుకునేవాణ్ణి. కాని సమస్య సమయం చాలకపోవడంతో కాదు, చదివిన పుస్తకం దగ్గర మనం మరికొంత సమయం ఆగకపోవడంతో.
చిత్రకారుడు ఒక అనువాదకుడు
ఏళ్ళ తరబడి రంగుల్తోనూ, గీతల్తోనూ సాధన చేస్తూ వచ్చేక ఇన్నాళ్ళకు నాకు అర్థమయిందేమంటే చిత్రలేఖనం కూడా ఒక కథనం. అక్కడ వాస్తవంగా ఉన్న రంగులకన్నా నువ్వు ఏ రంగులు చేర్చి తిరిగి చెప్తున్నావన్నదే ఆ చిత్రానికి ఆకర్షణ.
మహాకవిత్వదీక్షావిధి
కవులు, ముఖ్యంగా కొత్త తరహా కవిత్వం రాసేవారు, తమ కవిత్వ కళని నిర్వచించుకుంటూ రాసే కవితలు ప్రపంచమంతా కనిపిస్తాయి. ఇంగ్లీషులోనూ, పాశ్చాత్యప్రపంచంలోనూ అటువంటి కవితల్ని ars poetica కవితలని పిలుచుకోడం పరిపాటి