సాహిత్యసమాలోచన

కవిత్వం ఒక కరెంటు తీగ. కవి ఆ తీగకు ఒక కొసన స్విచ్చినొక్కుతాడు. మరొక కొసన పాఠకుడి సహృదయం బల్బులాగా వెలగకపోతే ఆ కరెంటు ప్రవాహం ఆగిపోయినట్టు, ఆ వైరింగు పాడయిపోయినట్టు. అలాకాక, ఒక కవిత చదవగానే పాఠకుడి హృదయం వంద కాండిల్సు ప్రకాశంతో వెలిగినట్టయితే, ఆ విద్యుత్ ప్రవాహం తెంపులేకుండా సంపూర్తిగా ప్రవహించినట్టు.